బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. దీంతో ఆయనను బుధవారం రాత్రి ఎయిర్‌ అంబులెన్స్‌లో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో మెట్లపై నుంచి పడిపోవడంతో కుడి భుజం ఫ్రాక్షరైంది. ఈనేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆయనను పట్నాలోని పరాస్‌ ఆస్పత్రికు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్లారు. లాలూ గతకొంతకాలంగా కిడ్నీ, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)