కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను కొన్ని సడలింపులతో జూన్ 28 వరకు పొడిగిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఈ నెల 21 ఉదయం 6 గంటలతో ముగియవలసి ఉంది. ప్రస్తుతం అనుమతించదగిన కార్యకలాపాలను అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరవవచ్చునని పేర్కొంది.
ఇంటర్ సిటీ బస్ ట్రాన్స్‌పోర్ట్‌ను చెన్నై సహా నాలుగు జిల్లాల్లో అనుమతిస్తున్నట్లు తెలిపింది. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో బస్సులను నడపవచ్చునని తెలిపింది. మెట్రో రైలు సేవలు కూడా 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ-రిజిస్ట్రేషన్ లేకుండా ఆటోరిక్షాలు, రెంటల్ క్యాబ్‌లను నడపవచ్చునని పేర్కొంది.
Lockdown in Tamil Nadu extended for one more week, till June 28th, with further relaxations.
— ANI (@ANI) June 20, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)