మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే మృతిని మావోయిస్టులు ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14న ఆర్కే మృతి చెందినట్లు మావోయిస్టులు ప్రకటించారు. కిడ్నీలు విఫలమై ఆయన మరణిచారని తెలిపారు. పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. చికిత్స అందించినా ఆర్కేను కాపాడలేకపోయామని తెలిపారు. గురువారం ఆర్కే మృతి చెందారని మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్‌ వెల్లడించారు. డయాలసిస్‌ కొనసాగుతుండగా కిడ్నీలు విఫలమై ఆర్కే మరణించారని తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)