మిజోరంలోని ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీ (Stone Quarry) కూలడంతో పది మంది కార్మికులు మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. నిరాటంకంగా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే రాష్ట్రంలో పాఠశాలలకు సెలవు ఇచ్చామని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేయాలని కోరిట్లు వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడటంతో పలు జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లను మూసివేసినట్లు తెలిపారు. అర్థరాత్రి బెంగాల్ తీరాన్ని తాకిన రెమాల్ తుఫాన్, భారీ వర్షాలకు ఏడుగురు మృతి, అంధకారంలో 15 మిలియన్ల మంది ప్రజలు
Here's Video
Ten Dead, Several Feared Trapped As Rescue Operation Continues After Stone Quarry Collapse In Mizoram,
The effects of #CycloneRemal were felt in the capital Aizawl when heavy rains caused the hillside to give way, with a search operation underway to retrieve trapped workers.… pic.twitter.com/PRqGVwH7vZ
— RT_India (@RT_India_news) May 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)