New Delhi, August 1: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్‌ తేదీలు ఖరారు చేశారు. ఈనెల 8.9,10 తేదీల్లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఈనెల 10న ప్రధాన మోదీ సమాధానం ఇవ్వనున్నారు. మ‌ణిపూర్ అంశంపై ప్ర‌ధాని మోదీ ఉభ‌య‌స‌భ‌ల్లో ప్ర‌క‌ట‌న చేయ‌డం లేద‌ని, అందుకే కేంద్ర స‌ర్కార్‌పై అవిశ్వాసాన్ని ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు విప‌క్షాలు పేర్కొన్న విష‌యం తెలిసిందే. లోక్‌స‌భ‌లో ఎంపీ గౌర‌వ్‌ గ‌గోయ్ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని స్పీక‌ర్ బిర్లా ఆమోదించారు.

ఇకపై కొత్తగా జననాలు, మరణాల నమోదుకు ఆధార్‌ కార్డు తప్పనిసరి, జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు-2023కి లోక్‌సభ ఆమోదం

జూలై 20వ తేదీన పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మైన నాటి నుంచి రోజు ఉభ‌య‌స‌భ‌లు మ‌ణిపూర్ అంశం విష‌యంలో వాయిదా ప‌డుతూనే ఉన్నాయి. ఇవాళ తొమ్మిదో రోజు కూడా స‌భాకార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌లేదు.అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన ఎంపీ గౌర‌వ్ గ‌గోయ్ నోటీసుపై 50 మంది స‌భ్యులు సంత‌కం చేశారు. లోక్‌స‌భ‌లో 543 మంది స‌భ్యులు ఉన్నారు. ప్ర‌స్తుతం ఎన్డీఏ బ‌లం 331. విప‌క్ష కూట‌మి ఇండియా బ‌లం 144 మంది. అయితే ఈ తీర్మానాన్ని విప‌క్షం నెగ్గ‌డం కుద‌ర‌దు. కానీ మ‌ణిపూర్ అంశంపై ప్ర‌ధాని మోదీ మాట్లాడే విధంగా చేస్తుంద‌ని విప‌క్షాలు భావిస్తున్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)