మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పది రోజుల్లోనే 241 శాతం కేసులు పెరిగాయి. జూన్ 3న 5,127 కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య నేటికి 17,480కి చేరింది. ఆ రాష్ట్రంలో మరణాల రేటు 1.86 శాతంగా ఉంది. ఈ ఏడాది మే నెలలోనే 9,354 కేసులు నమోదు కాగా, 5,980 కేసులు ముంబై నుంచే ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. గత నెలలో కొవిడ్‌తో 17 మంది చనిపోయినట్లు వెల్లడించారు.తాజాగా ముంబైలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ BA.4, 1 of BA.5 కేసులను కనుగొన్నారు. ముంబైలో ముగ్గురిలో ఈ ఉపవేరియంట్ వైరస్ కనుగొన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
Three cases of BA.4 and one of BA.5 Omicron sub-variants of coronavirus found in Mumbai: Maharashtra health department
— Press Trust of India (@PTI_News) June 13, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)