జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దక్షిణ భారతదేశంలో అత్యంత తీవ్రమైన జిహాదీ టెర్రర్ గ్రూపు నిఘా కదలికను బాస్ట్ చేయడానికి 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాదులు దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించారనే వార్తల నేపథ్యంలో వారితో లింకులు ఉన్నవారి కోసం NIA సోదాలు చేస్తోంది. నాలుగు రాష్ట్రాల్లో 19 ప్రాంతాల్లో ఒకేసారి ఎన్ ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉగ్రవాద కుట్ర కేసులో డిసెంబర్ 18 ఉదయం నుంచే కర్నాటకలోని 11, జార్ఖండ్‌లో నాలుగు, మహారాష్ట్రలో మూడు, ఢిల్లీలో ఒకచోట ఎన్ఐఏ సోదాలు చేస్తోంది.
వారం రోజుల క్రితం, కర్ణాటకలోని బెంగళూరులో దాదాపు ఆరు ప్రాంతాల్లో, మహారాష్ట్రలోని 40 చోట్ల దాడులు చేసి 15 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో లెక్కకు మించిన నగదు, ఆయుధాలు, కీలక పత్రాలు, ఇతర ఆయుధాలు,స్మార్ట్ ఫోన్లు, పలు డిజిటల్ పరికరాలను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. దేశ వ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందన్న సమాచారంతోనే జాతీయ సంస్థ ఈ దాడులు చేపడుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Here's ANI News
National Investigation Agency (NIA) is conducting searches at 19 locations in South India by busting a highly radicalised Jihadi terror group pic.twitter.com/oYnsKJjnaW
— ANI (@ANI) December 18, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)