దేశంలో కొత్తగా 7,495 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, నిన్న 6,960 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న కరోనా వల్ల 434 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో మొత్తం 78,291 మంది చికిత్స తీసుకుంటున్నారు. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,42,08,926కు చేరింది. కరోనా మరణాల సంఖ్య మొత్తం 4,78,759కి పెరిగింది. దేశంలో మొత్తం 1,39,69,76,774 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. కాగా, దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 236కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో ఇప్పటివరకు మొత్తం 104 మంది కోలుకున్నారు.
The total number of #Omicron cases in India rises to 236, of which 104 have recovered: Ministry of Health and Family Welfare #COVID19 pic.twitter.com/1JccWcCBlX
— ANI (@ANI) December 23, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)