బిహార్ రాజధాని పట్నా(Patna)లోని పున్‌పున్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం(Fire Accident)జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా నడిబొడ్డున ఉన్న హోటల్‌లో గురువారం ఉదయం 11 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా హోటల్ మొత్తం వ్యాపించి, అన్ని ఫ్లోర్లకు విస్తరించాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది 2 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడ్డ 30 మందిని పోలీసులు రక్షించారు. ఇందుకోసం 8 అగ్నిమాపక యంత్రాలను ఘటనాస్థలికి చేర్చారు. రైల్వే స్టేషన్ సమీపంలోని రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజీవ్ మిశ్రా తెలిపారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)