గ్రేటర్ నోయిడాలో బుధవారం ఇండియా ఎక్స్పో మార్ట్‌లో సెమీకాన్ ఇండియా 2024 ప్రారంభ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. దేశీయంగా పెద్దసంఖ్యలో చిప్స్ తయారీపై భారత్ ప్రస్తుతం దృష్టిసారించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సెమీకండక్టర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నదని చెప్పారు.
సెమీకండక్టర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలతో బాసటగా నిలుస్తున్నదని చెప్పారు. భారత్ అనుసరిస్తున్న విధానాలతో భారత్‌లో లక్షన్నర కోట్లకు పైగా విలువైన పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రానిక్ రంగ మార్కెట్ 150 బిలియన్ డాలర్లకు పైగా ఉందని, దీన్ని మరింత పెంచాలనేది తమ లక్ష్యమని ప్రధాని వివరించారు. ఈ దశాబ్ధం చివరికి మన ఎలక్ట్రానిక్ రంగం 500 బిలియన్ డాలర్ల స్ధాయికి ఎదగాలనే లక్ష్యం నిర్ధేశించుకున్నామని తెలిపారు. దీంతో భారత యువత కోసం ఈ రంగం నుంచి ఏకంగా దాదాపు 60 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
Here's Video
India's semiconductor sector is on the brink of a revolution, with breakthrough advancements set to transform the industry. Addressing the SEMICON India 2024.https://t.co/nPa3g5lAO4
— Narendra Modi (@narendramodi) September 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)