పుదుచ్చేరి ప్రభుత్వం ఈ నెల 14 వరకు కరోనా లాక్‌డౌన్‌ను పొడగించింది. ఇంతకు ముందు సడలింపులతో ఈ నెల 7వ తేదీ వరకు పొడగించారు. సోమవారం రాత్రితో గడువు ముగియగా.. మరోవారం పొడగిస్తూ ఆదేశాలిచ్చారు. మంగళవారం నుంచి మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేశారు. సోమవారం అక్కడ 482 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పుదుచ్చేరిలో ప్రస్తుతం 8,270 క్రియాశీల కేసులు ఉండగా.. మొత్తం 1,628 మంది వైరస్‌ బారినపడి మృతి చెందారు. లక్షలకుపైగా కొవిడ్‌ కేసులు నమోదవగా.. 99,181 మంది కోలుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)