రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులతో సహా ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు గుజరాత్‌కు చెందిన వారని ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. నిందితుడిని ఢిల్లీ నుంచి గుజరాత్‌కు తీసుకువెళ్తున్న సమయంలో రాజస్థాన్‌లోని భబ్రూ ప్రాంతంలో పోలీసుల వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కు ఢీకొట్టడంతో పోలీసుల వాహనం నుజ్జునుజ్జయ్యింది.
ఢిల్లీ నుంచి గుజరాత్‌కు నిందితులను తీసుకెళ్తున్న గుజరాత్ పోలీసుల వాహనం జైపూర్‌లోని భబ్రూ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో నలుగురు పోలీసులతో సహా ఐదుగురు మరణించడం బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి, భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని సీఎం అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు.
Five people including four policemen died when a vehicle of Gujarat Police carrying an accused from Delhi to Gujarat met with an accident in the Bhabroo area of Jaipur, tweets Chief Minister of Rajasthan @ashokgehlot51 https://t.co/omhiMQUgG6
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) February 15, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)