2022 డిసెంబ‌ర్‌లో ఉత్త‌రాఖండ్‌లోని రూర్కీ వ‌ద్ద రిష‌బ్ పంత్ కారు ప్ర‌మాదానికి గురైన స‌మ‌యంలో ఆ క్రికెట‌ర్‌ను ఇద్ద‌రు వ్య‌క్తులు కాపాడారు. భారత క్రికెటర్ ను కాపాడిన ఇద్ద‌రిలో 25 ఏళ్ల ర‌జ‌త్ కుమార్(Rajat Kumar) ఒక‌రు. అయితే ఫిబ్రవరి 9న ర‌జ‌త్ ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజాఫ‌ర్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన అత‌ను త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో క‌లిసి విషం తీసుకున్నాడు. ఈ ఘటనలో ర‌జ‌త్ గ‌ర్ల్‌ఫ్రెండ్ ప్రాణాలు కోల్పోయింది. ర‌జ‌త్ కుమార్ ప్ర‌స్తుతం క్రిటిక‌ల్ కండీష‌న్‌లో ఉన్నాడు.

ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ కారుకు ఘోర ప్రమాదం.. గాయాలతో దవాఖానలో చేరిన పంత్

వీళ్లిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే కులాలు వేరు కావ‌డం వ‌ల్ల వాళ్ల పెళ్లి ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. రెండు కుటుంబాల‌కు చెందిన పెద్ద‌లు వాళ్ల రిలేష‌న్‌ను తిర‌స్కరించారు. అయితే క‌శ్య‌ప్ మృతిపై ఆమె త‌ల్లి ఆరోప‌ణ‌లు చేశారు. త‌న కుమార్తెను కిడ్నాప్ చేసి, విషం ఇచ్చి ర‌జ‌త్ చంపిన‌ట్లు ఆమె పేర్కొన్న‌ది.

Indian Cricketer Gifted Scooter to Rajat Kumar

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)