వ్యక్తికి తెలియకుండా అతని మొబైల్ ఫోన్ సంభాషణను రికార్డు చేయడం రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం వారి గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 38 ఏండ్ల మహిళ తన భర్త నుంచి భరణం కోరుతూ వేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.తనకు తెలపకుండా తన భర్త తాను ఫోన్‌లో అతడితో మాట్లాడిన మాటలను రికార్డు చేశాడని ఆమె కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆమె తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపిస్తూ ఆమెకు తెలియజేయకుండా ఆమె సంభాషణను రికార్డు చేసి దాన్ని తిరిగి ఆమెకు వ్యతిరేక సాక్ష్యంగా చూపలేరని తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించిన జస్టిస్ రాకేశ్ మోహన్ పాండే ఈ నెల 5న ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టారు.
Here's Live Law Tweet
Recording Phone Conversation Without Permission Violates Right To Privacy Under Article 21: Chhattisgarh High Courthttps://t.co/QkqVdmdAkP
— Live Law (@LiveLawIndia) October 14, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)