వివాహిత సోదరుడు మరణించిన తర్వాత సోదరి కారుణ్య నియామకం కోరుకోలేరని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. కర్ణాటకలోని తుమకూరుకు చెందిన పల్లవి (29).. మరణించిన తన సోదరుడి ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద తనకు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. కర్ణాటక హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రసన్న బి వరాలే, జస్టిస్‌ కృష్ణ ఎస్‌ దీక్షిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.

విచారణ సందర్భంగా సోదరుడి ఉద్యోగంపై సోదరికి ఎలాంటి హక్కులు ఉండవని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. సోదరుడి ఉద్యోగంపై సోదరికి ఎలాంటి హక్కులు ఉండవని తెలిపింది.  రాజ్యంగ నిబంధనల ప్రకారం కుటుంబం అంటే తల్లీ, తండ్రి, భార్య, పిల్లలు మాత్రమేనని, మేజర్లు అయిన తర్వాత సోదరుడు, సోదరి ఒకే కుటుంబసభ్యులుగా పరిగణించలేమని కోర్టు వ్యాఖ్యానించింది.

Here's Live Law Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)