తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ బంగారం షోరూం (Jewellery Showroom) జోస్‌ అలూక్కాస్‌లో భారీ చోరీ జరిగింది (Gold Jewellery Robbed).చోరీకి సంబంధించిన దృశ్యాలు షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో నిక్షిప్తమయ్యాయి.కోయంబత్తూర్‌ (Coimbatore)లోని గాంధీపురం ప్రాంతంలో ఉన్న జోస్‌ అలూక్కాస్‌ (Jos Alukkas)లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి దుకాణంలోకి చొరబడ్డాడు. ఆ తర్వాత షోరూమ్‌ మొత్తం కలియతిరిగాడు. నచ్చిన బంగారాన్ని తన వెంట తెచ్చుకున్న సంచిలోకి నింపుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మార్గంలోనే ఎంచక్కా బయటకు వెళ్లిపోయాడు.

ఉదయం షోరూమ్ తెరిచిన సిబ్బంది దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. షో రూమ్ నుంచి సుమారు 25 కేజీల బంగారం, వజ్రాభరణాలు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన క్లూస్‌ టీమ్‌.. వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ దొంగ కోసం గాలింపు చేపడుతున్నారు.

Man Steals 25 kg of Gold Video

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)