ఈశాన్య రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో త‌మిళ‌నాడు వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. కోయంబ‌త్తూరు, తిరుపూర్, మ‌ధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో కుండ‌పోత వాన ప‌డుతోంది. నీల్‌గిరి జిల్లాలోని ఐదు తాలుకాల‌ను వ‌ర్షం ముంచెత్తింది. ఈ క్ర‌మంలో ఈ జిల్లాల్లోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల‌కు అధికారులు సెల‌వులు ప్ర‌క‌టించారు. రాబోయే 24 గంట‌ల్లో త‌మిళ‌నాడు, కేర‌ళ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రించారు. గ‌త కొద్ది రోజుల నుంచి కేర‌ళ వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం క‌న్నూరు జిల్లాలో 7 సెం.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)