తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎరువులు తీసుకెళ్తున్న ట్రక్కు నుంచి తాడు వేలాడటంతో అది వెనక వస్తున్న బైకర్ మెడకు చుట్టుకుంది. దీంతో బైక్‌పై నుంచి బైకర్ అమాంతం కింద పడ్డాడు. అయితే ఈ ఘటనలో అతనికి ఎలాంటి సీరియస్ గాయాలు కాకపోవడం ఆశ్చర్యంగా చెప్పవచ్చు. శ్రీవైకుంటం పట్టణానికి చెందిన బైకర్ ముత్తు తన పని ప్రదేశం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏరల్ ప్రాంతం దాటుతుండగా ఒక్కసారిగా బైక్‌పై నుంచి కింద పడిపోయాడు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ముత్తుకు స్వల్ప గాయాలయ్యాయి.సమీపంలోని దుకాణంలోని సిసిటివి ఫుటేజ్‌లో ట్రక్కుపై కట్టిన తాడు జీను తెగిపడి బైక్‌పై నుండి విసిరిన ముత్తు మెడకు చిక్కుకుందనట్లుగా చూపిస్తున్నాయి.
Here's Video
Tamil Nadu: Freak accident caught on camera in Tuticorin. The rope binding the gunny bags of fertilisers to the lorry loosened & wrapped around a bike rider.
The rider is being treated at the hospital & is out of danger.@sreeprapanch | @prathibhatweets pic.twitter.com/kfv5u39ZG1
— TIMES NOW (@TimesNow) December 15, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)