Twitter Blocks IT Minister's Account: అమెరికా ఐటీ చట్టాల ఉల్లంఘన అనే అభియోగాల మీద కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికారిక ఖాతాను బ్లాక్ చేసిన ట్విట్టర్, ఇది 'భారత ఐటీ మార్గదర్శకాల స్థూల ఉల్లంఘన’ గా మంత్రి అభివర్ణన
సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తన ఖాతాను గంట పాటు నిలిపివేసిందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. అమెరికా డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం నిబంధన ఉల్లంఘంచానని పేర్కొంటూ తన అధికారిక అకౌంట్‌ను ట్విట్టర్ ఒక గంట పాటు బ్లాక్ చేసి అనంతరం తిరిగి పునరుద్ధరించిందని మంత్రి తెలిపారు. ట్విట్టర్ యొక్క ఈ చర్య ‘భారతదేశ ఐటీ మార్గదర్శకాల స్థూల ఉల్లంఘన’ గా మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభివర్ణించారు.
Friends! Something highly peculiar happened today. Twitter denied access to my account for almost an hour on the alleged ground that there was a violation of the Digital Millennium Copyright Act of the USA and subsequently they allowed me to access the account. pic.twitter.com/WspPmor9Su
— Ravi Shankar Prasad (@rsprasad) June 25, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 25, 2021 05:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

