రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ టైలర్‌ కన్హయ్య లాల్‌ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో బీజేపీ సస్పెండెడ్‌ నేత నవీన్ కుమార్‌ జిందాల్‌కు, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయట. ఈ మేరకు ఈ ఉదయం మూడు బెదిరింపు ఈ-మెయిల్స్‌తో పాటు కన్హయ్యను చంపిన ఘటన తాలుకా వీడియోను ఎటాచ్‌ చేసి మరీ ఆయనకు పంపించారు దుండగులు.ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలియజేసిన నవీన్‌కుమార్‌ జిందాల్‌.. ఢిల్లీ పోలీసులను ఆశ్రయిస్తూ ట్వీట్‌లో ట్యాగ్‌ చేశారు.

నూపుర్‌ వ్యాఖ్యల టైంలోనే మొహమ్మద్‌ ప్రవక్తను ఉద్దేశిస్తూ నవీన్‌కుమార్‌ జిందాల్‌ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. అది దుమారం రేపింది. ఈ ఘటన తర్వాత నవీన్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది బీజేపీ. అంతేకాదు.. పలు రాష్ట్రాల్లో ఆయనపై కేసులు సైతం నమోదు అయ్యాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)