ప్రముఖ గాయని ఉషా ఊతుప్ భర్త జానీ చాకో ఊతుప్ కార్డియాక్ అరెస్టుతో మృతి చెందారు. సోమవారం రాత్రి కోల్ కతాలోని తమ నివాసంలో టీవీ చూస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. గుండె నొప్పితో విలవిల్లాడుతున్న జానీ చాకోను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన తుదిశ్వాస వదిలారని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. జానీ చాకోకు ప్రస్తుతం 78 ఏళ్లు.. జానీ చాకో ఊతుప్, ఉషా ఊతుప్ దంపతులకు ఇద్దరు సంతానం.. కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి. హాలీవుడ్‌ లో విషాదం.. ‘టైటానిక్’, ‘అవతార్’ చిత్రాల నిర్మాత‌ క‌న్నుమూత.. క్యాన్సర్ తో గత కొంతకాలంగా బాధపడుతున్న జాన్ లాండౌ

సంగీత ప్రపంచంలో ఉషా ఊతుప్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సంగీతంలో ఆమె చేసిన కృషికి గానూ ఉషా ఊతుప్ ను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 1971లో ‘హరేరామ హరేకృష్ణ’ సినిమాలోని పాటతో గుర్తింపు తెచ్చుకున్న ఉషా ఊతుప్ తెలుగుతో పాటు మొత్తం 15 భాషల్లో పాటలు పాడారు. అల్లు అర్జున్ సినిమా రేసుగుర్రం టైటిల్ సాంగ్ ను ఉషా ఊతుప్ పాడారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)