ఉత్తరప్రదేశ్‌లోని ఒక జిల్లా ఆసుపత్రిలో పవర్ కట్ కావడంతో వైద్యులు తమ మొబైల్ ఫోన్లలోని టార్చిలైట్ వెలుగులో రోగులకు చికిత్స అందించారు. బల్లియా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ సంఘటనపై బల్లియా జిల్లా ఆసుపత్రి ఇంచార్జి డాక్టర్ ఆర్డీ రామ్ సోమవారం వివరణ ఇచ్చారు. పవర్ కట్ వల్ల డాక్టర్లు, రోగులు కేవలం 20 నిమిషాలు మాత్రమే ఇబ్బంది పడినట్లు తెలిపారు. గతంలో జెనరేటర్ బ్యాటరీలు చోరీ కావడంతో వీటిని విడిగా ఉంచినట్లు చెప్పారు. దీంతో బ్యాటరీలను సెట్ చేసి జెనరేటర్ ఆన్ చేసేందుకు కొంత సమయం పట్టిందని చెప్పారు.అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఇంత వరకు స్పందించలేదు.
RD Ram, CMS incharge at the hospital says there was a delay in installing batteries of the generator. The batteries are kept elsewhere to ensure it is not stolen by miscreants. pic.twitter.com/YzQUnHfCpt
— Piyush Rai (@Benarasiyaa) September 12, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)