యూపీలో ఫతేపూర్ జిల్లాలో హనుమాన్ వేషం వేసిన వ్యక్తి డ్యాన్స్ చేస్తూ వేదికపై కుప్పకూలి మరణించాడు. సేలంపూర్ గ్రామానికి చెందిన 50 ఏళ్లకుపైగా వయసున్న రామ్ స్వరూప్, శరన్నవరాత్రుల సందర్భంగా శనివారం రాత్రి హనుమంతుడి వేషం వేశాడు. రామ్ లీలా నాటకాన్ని ప్రదర్శించాడు. లంకా దహనం ఘట్టం సందర్భంగా నిప్పంటించిన తోకతో ఒక బల్లపై డ్యాన్స్ చేశాడు. అయితే గిరాగిరా తిరిగిన అతడు ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో డ్యాన్స్ చేస్తున్న బల్ల పైనుంచి కిందపడ్డాడు. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
फतेहपुर के धाता में दुर्गा पूजा पंडाल के एक कार्यक्रम में हनुमान की भूमिका निभा रहे 55 साल के रामस्वरूप की मौत, लंकादहन के दौरान चक्कर खाकर मंच से गिरे और चली गई जान @CMOfficeUP @sengarlive @navalkant pic.twitter.com/iR3WZQAlYo
— rishabh mani (@rishabhmanitrip) October 2, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)