లోక్‌ సభ ఎన్నికలు-2024లో (Loksabha Elections 2024) భాగంగా దేశవ్యాప్తంగా రెండో దఫా పోలింగ్ (Second Phase) మొదలైంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ షురూ అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 1,202 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 15.88 కోట్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్ లో కొత్తగా పెళ్లయిన వధువు దీప్తి శర్మ 2024 లోక్‌సభ ఎన్నికల రెండో దశలో ఓటు వేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా మొదలైన లోక్‌ సభ రెండో దశ పోలింగ్.. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 88 స్థానాలకు పోలింగ్.. 15.88 కోట్ల మంది ఓటర్లకు ఓటు హక్కు అవకాశం.. బరిలో రాహుల్ గాంధీ సహా అతిరథులు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)