లోక్‌సభ ఎన్నికల ముందు మోదీ సర్కారుకు భారత ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ‘వికసిత్ భారత్’ పేరుతో కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపెయిన్ వెంటనే నిలిపివేయాలని ఈసీ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పౌరుల వాట్సాప్‌కు వికసిత్ భారత్ మెసెజ్‌లు పంపడం తక్షణమే ఆపేయాలని కేంద్ర ఐటీ శాఖకు ఈసీ నోటీసులు జారీ చేసింది. వాలంటీర్లపై వైరల్ అవుతున్న ప్రకటన ఫేక్, తాము ఏ ప్రకటన చేయలేదని వెల్లడించిన ఎన్నికల సంఘం
ఇకనుంచి ఎలాంటి మెసేజ్ డెలివరీ చేయొద్దని ఆదేశించింది. ఈసీ ఆదేశాలపై స్పందించిన ఐటీ శాఖ.. ఎన్నికల కోడ్‌కు ముందుగానే మెసెజ్‌లు పంపినప్పటికీ వాటిలో కొన్ని నెట్‌వర్క్ కారణంగా ఆలస్యంగా డెలివరీ అవుతున్నట్లు తెలిపింది.వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో మార్చి 17 నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడుతల్లో పార్లమెంట్, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Here's News
Regarding the 'Viksit Bharat Sampark' WhatsApp message, ECI has directed the Ministry of Electronics and Information Technology, Government of India to ensure that there is no further delivery of WhatsApp messages during the MCC period. pic.twitter.com/f75KGqfKAI
— Abhishek (@AbhishekSay) March 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)