దేశంలో పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటంతో శనివారం(మార్చి 17) నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జూన్ 6 వరకు మొత్తం 80 రోజుల పాటు ఎన్నికల నిబంధనలు అమల్లో ఉంటాయి. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటున్న గ్రామ వలంటీర్లు ఎవరైనా కనిపిస్తే ఎన్నికల సంఘానికి వాట్సాప్ చేయాలంటూ ఓ ప్రకటన చక్కర్లు కొడుతోంది. వైసీపీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర, వీడియో ఇదిగో..
వలంటీర్ల ఫోటో తీసి వారి పేరు, ఊరు చెప్పాలని తెలిపారు. ఇందులో ఎన్నికల కమిషనర్ పేరుతో ఓ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్‌కు వలంటీర్లపై ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. అయితే వాలంటీర్లపై వైరలవుతున్న ప్రకటన ఫేక్ అని ఎన్నికల సంఘం పేర్కొంది. తాము ఏ ప్రకటన చేయలేదని వెల్లడించింది. ఎన్నికల కమిషనర్ సీఈవో పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని, 9676692888 సీఈఓ వాట్సాప్‌గా వైరల్ అవుతున్న నెంబర్ ఫేక్ అని స్పష్టం చేసింది.
Here's EC Tweet
FAKE NEWS ALERT!#APElections2024 pic.twitter.com/pnWUZ8ZUqb
— Chief Electoral Officer, Andhra Pradesh (@CEOAndhra) March 21, 2024
ఏపీలో పలు చోట్ల ఎన్నికల కోడ్ ఉల్లంఘణ జరుగుతుందంటూ, గ్రామ వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారంటూ ఈసీకి పలు ఫిర్యాదులు అందాయి. దాంతో ప్రభుత్వ అధికారులు, గ్రామ వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది.