ఢిల్లీలోని అక్షరధామ్‌ మెట్రో స్టేషన్‌ పైనుంచి ఓ యువతి కిందకు దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌) సకాలంలో స్పందించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. గురువారం ఉదయం 7.28 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఒక యువతి అక్షరధామ్‌ మెట్రో స్టేషన్‌ వద్దకు వచ్చింది. అక్కడ ఉన్న ఒక గోడపైకి ఎక్కి అంచునకు చేరింది.

అక్కడ నుంచి కిందకు దూకేందుకు సిద్ధమైంది. గమనించిన మెట్రోస్టేషన్‌లోని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది వెంటనే అక్కడకు వచ్చారు. కొందరు ఆమెను మాట్లాల్లో దించి సముదాయించి కిందకు దించేందుకు ప్రయత్నించారు. ఈ లోపు సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన మరికొందరు ముందు జాగ్రత్తగా ఆమె కింద పడే చోట బ్లాంకెట్లు పట్టుకుని ఉన్నారు. ఆ యువతి ఎంతచెప్పినా వినిపించుకోకుండా అక్షరధామ్‌ మెట్రో స్టేషన్‌ గోడ అంచు పైనుంచి ఆమె కిందకు దూకింది. సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది పట్టుకున్న బ్లాంకెట్లలో పడటంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. అయితే స్వల్పంగా ఆమె కాలికి గాయమైంది. వెంటనే ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. యువతి ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)