షిండే అంకుల్‌.. ముఖ్యమంత్రి కావడం ఎలా అంటూ ఓ చిన్నారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగిన ప్రశ్న ఇంటర్నెట్లో నవ్వులు పూయిస్తోంది. ముంబైలోని నందనవన్ బంగ్లాలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను కలిసింది అన్నడా దామ్రే అనే ఓ చిన్నారి. ‘మీలాగా సీఎం కావడం ఎలా? అస్సాంలో వరదలు వచ్చినప్పుడు, మీరు ప్రజలకు సహాయం చేయడానికి నీటిలో నడిచారు. మీలాగా వరద బాధిత ప్రజలను ఆదుకోవడం ద్వారా నేను ముఖ్యమంత్రిని కాగలనా? అంటూ అమాయకంగా ప్రశ్నించింది ఆ చిన్నారి. అంతేకాదు.. దీపావళి సెలవుల్లో తననూ గౌహతికి తీసుకెళ్లాలని సీఎం షిండేను అభ్యర్థించింది.

దానికి సీఎం షిండే నవ్వుతూ.. నువ్వు ముఖ్యమంత్రి కచ్చితంగా అవుతావ్‌. అందుకోసం ఒక తీర్మానం కూడా పాస్‌ చేస్తాం అంటూ చెప్పారాయన. దీపావళికి గువాహతికి తీసుకెళ్తానని, అక్కడున్న కామాఖ్య గుడికి వెళ్దామా? అని అడిగారాయన. దానికి అలాగే అనే సమాధానం ఇచ్చింది. ఈ చిన్నారి చాలా హుషారు అని షిండే అనడంతో.. అక్కడున్నవాళ్లంతా నవ్వారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)