ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. రాంపూర్ కోర్టులో భరణం కేసు విచారణకు హాజరైన ఓ మహిళ, కోర్టు బయటే తన భర్తను చెప్పుతో కొట్టింది. బాధితురాలి వివరాల ప్రకారం.. భర్త కోర్టు వెలుపల మూడుసార్లు తలాక్ చెప్పాడు. ఆ తర్వాత ఆగ్రహంతో ఆమె భర్తపై చెప్పుతో దాడి చేసింది. ఈ సంఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.బాధితురాలు 2018లో వివాహం అయిందని తెలిపారు. పెళ్లి నాటి నుండి భర్త కొట్టేవాడు, అదనపు కట్నం కోసం వేధించేవాడు. ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత, ఆమెను ఇంట్లో నుండి నిష్క్రమింపజేశాడు. కోర్టులో భరణం కోసం కేసు పెట్టి, ఆర్థిక సాయం కోరింది. అయితే, భర్త పిల్లలను తన దగ్గర నుంచి దూరం చేశారు.

విచారణకు బాధితురాలు అత్తతో హాజరయ్యగా, భర్త తండ్రితో సహా వచ్చాడు. విచారణ తర్వాత కోర్టు వెలుపల భర్త, ఆమె మామ ఇద్దరూ దుర్భాషలాడుతూ కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. ఆమె నిరాకరించడంతో, భర్త అక్కడికక్కడే మూడుసార్లు తలాక్ చెప్పారు. భయంతో ఆమె తన భర్త, మామపై చెప్పుతో దాడి చేసింది. ఆదివారం వేదికలో కొంత గందరగోళం కూడా జరిగింది. అక్కడే కొందరు సంఘటన వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో, అది వైరల్‌గా మారింది. బాధితురాలు తెలిపింది, “మొదట వాళ్లే నన్ను కొట్టారు. ఆత్మరక్షణ కోసం మాత్రమే దాడి చేశాను. నా పిల్లలను నాకు అప్పగించాలి. నిందితుడికి కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. వక్ఫ్‌ చట్టం-2025పై స్టే విధించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, ఓ ప్రొవిజన్‌ నిలిపివేస్తూ కీలక తీర్పును వెలువరించిన అత్యున్నత ధర్మాసనం

Woman Confronts Husband Over Triple Talaq

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)