
వక్ఫ్ (సవరణ) చట్టం-2025లోని ముఖ్యమైన ప్రావిజన్‌ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ ప్రావిజన్ ప్రకారం, కనీసం ఐదేళ్లపాటు ఇస్లాం మతాన్ని అనుసరించిన వ్యక్తి మాత్రమే వక్ఫ్ ఆస్తిని చేయగలరనే అంశాన్ని అత్యున్నత ధర్మాసనం నిలిపివేసింది. కోర్టు ఈ నిబంధనను చెలామణీ చేయడానికి ముందుగా ముస్లిం మతాన్ని అనుసరిస్తున్నట్లు నిర్ణయించే స్పష్టమైన నిబంధనలు ఏర్పాటు చేయాలి అని పేర్కొంది.
అయితే, వక్ఫ్ (సవరణ) చట్టం-2025 మొత్తం మీద స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కొంత భాగానికి మాత్రమే తాత్కాలిక రక్షణ అవసరమని అభిప్రాయపడింది. ముఖ్యంగా వక్ఫ్ బోర్డు, కౌన్సిల్‌లో ముస్లిం సభ్యుల పరిమాణంపై స్పష్టమైన పరిమితులను కోర్టు సూచించింది. అవేంటంటే..
వక్ఫ్ బోర్డులో ముస్లిములు మెజారిటీగా ఉండాలి
ముస్లిమేతర సభ్యుల సంఖ్య ముగ్గరు లేదా నలుగురకే పరిమితం చేయాలి
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ముస్లిం వ్యక్తి ఉండటం మంచిదని పేర్కొంది
ఢిల్లీ, బాంబే హైకోర్టులకు బాంబు బెదిరింపు మెయిళ్లు, కోర్టు నుంచి పరుగులు పెట్టిన లాయర్లు, అర్ధాంతరంగా ఆగిపోయిన విచారణలు
ఈ చట్టాన్ని వ్యతిరేకించి దాదాపు 100కి పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వాటిలో ప్రధానంగా ఈ చట్టం ముస్లింల ఆస్తులను లక్ష్యంగా చేసి, అవి సులభంగా పబ్లిక్ లేదా ప్రైవేట్ ఆక్రమణలకు గురవ్వుతాయని ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని వక్ఫ్ ఆస్తుల రక్షణ కోసం మాత్రమే తీసుకొచ్చామని వాదించింది. ఈ కేసు ఏప్రిల్ నెలలో పార్లమెంట్‌లో చట్టం క్లియర్ అయిన గంటల్లోనే సుప్రీంకోర్టులో ప్రవేశించింది. ముఖ్యంగా వక్ఫ్ ఆస్తుల డీనోటిఫై అధికారాల నిబంధనలను, వ్యక్తులు, డీడ్ల ఆధారంగా వక్ఫ్‌గా గుర్తించిన ఆస్తుల పరంపరలను కోర్టు పరీక్షించింది.