రెజ్లింగ్‌ ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరన్‌ సింగ్‌ తమను లైంగికంగా వేధించాడంటూ మహిళా రెజ్లర్లు ఆరోపించినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు ఆందోళనకు దిగారు.ఇన్నాళ్లు తాము గెలుచుకున్న పతకాలను గంగానదిలో కలుపాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ఇవాళ సాయంత్రం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చేరుకున్నారు. పతకాలను గంగానదిలో పడేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రెజ్లర్లు అక్కడే ధర్నాకు దిగారు.

బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నూతన పార్లమెంట్ భవనం ముందు ధర్నా చేసేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు. పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. అరెస్ట్‌ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు.

ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)