PM Modi Bangladesh Tour: కరోనా నుంచి కాపాడు తల్లీ, బంగ్లాదేశ్ జెశోరేశ్వరి కాళీ ఆలయాన్నిసందర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ 50వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో అతిథిగా వెళ్లిన భారత ప్రధాని
రెండు రోజుల పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi Bangladesh Tour) అక్కడ పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం ఆయన సత్కిరా జిల్లా ఈశ్వరీపూర్ లోని జెశోరేశ్వరి కాళీ ఆలయాన్ని (PM Narendra Modi Offers Prayers at Jeshoreshwari Kali Temple) సందర్శించుకున్నారు. దుర్గామాత శక్తి పీఠాల్లో జెశోరేశ్వరి ఆలయం ఒకటి.
కాళీ మాతను దర్శించుకున్న అనంతరం మోదీ మీడియాతో మాట్లాడుతూ... ఈ రోజు ఇక్కడి కాళీ మాతకు పూజ చేసే అవకాశం లభించిందని చెప్పారు. మానవాళిని కరోనా నుంచి కాపాడాలని తాను జగన్మాతను కోరుకున్నానని మోదీ చెప్పారు. కాగా, బంగ్లాదేశ్ 50వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో అతిథిగా పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడకు వెళ్లారు. అలాగే, ఆయన పలు కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు.
Here's PM Narendra Modi Offers Prayers at Jeshoreshwari Kali Temple in Ishwaripur
#WATCH Prime Minister Narendra Modi offers prayers at Jeshoreshwari Kali Temple in Ishwaripur, during his two-day visit to Bangladesh pic.twitter.com/0SDItuidE9
— ANI (@ANI) March 27, 2021
Bangladesh: Prime Minister Narendra Modi offers prayers at Jeshoreshwari Kali Temple in Ishwaripur, Satkhira district.
This is the second day of the PM's two-day visit to the country. pic.twitter.com/enEYPZvG6O
— ANI (@ANI) March 27, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 27, 2021 12:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

