Newdelhi, Oct 13: మనుషుల్లో క్రూరత్వం ఎంత ఉందో మంచితనం కూడా అంతే ఉంది. యూపీలోని (UP) ఘజియాబాద్ లో జరిగిన ఓ ఘటనే దీనికి రుజువు. అప్పుడే పుట్టిన ఓ పసిబిడ్డను (UP Police To Adopt Newborn Girl) గుర్తుతెలియని వ్యక్తులు ఘజియాబాద్ లోని నిర్మానుష్య పొదల్లో వదిలేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పుష్పేంద్ర సింగ్ అక్కడికి చేరుకొని, ఆ ఆడ బిడ్డను చూసి చలించిపోయాడు. పెళ్లై ఆరేళ్లెనా ఆయనకు పిల్లలు కలగలేదు. దీంతో దశమి రోజు దేవుడిచ్చిన వరంగా భావించి భార్యతో కలిసి ఆ పసిబిడ్డను దత్తత తీసుకున్నాడు. పోలీసు మంచితనంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
పొదల్లో దొరికిన పసిబిడ్డను దత్తత తీసుకున్న పోలీసు
యూపీ - ఘజియాబాద్ లో అప్పుడే పుట్టిన ఓ పసిబిడ్డను గుర్తుతెలియని వ్యక్తులు పొదల్లో వదిలేశారు.
విషయం తెలుసుకున్న ఎస్ఐ పుష్పేంద్ర సింగ్ అక్కడికి చేరుకొని, ఆ బుజ్జాయిని చూసి చలించిపోయాడు.
పెళ్లై ఆరేళ్లెనా ఆయనకు పిల్లలు కలగలేదు.… pic.twitter.com/sTk7fjpQVg
— Telugu Scribe (@TeluguScribe) October 13, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)