హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాంచి బిర్సా ముండా ఎయిర్‌పోర్టు నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు మొత్తం 36 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. వారిని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా శామీర్‌పేట్‌లోని ఓ రిసార్ట్స్‌కు తరలించారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష తేదీ ఖరారయ్యే వరకు వీరంతా హైదరాబాద్‌ రిసార్టులో ఉండనున్నారు. ఆపరేషన్‌ జార్ఖండ్‌ బాధ్యతలను తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌ కుమార్‌కు టీపీసీసీ అప్పగించింది.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)