మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ మనవడు, జనతాదళ్ (సెక్యులర్) నేత ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు షాకిచ్చింది. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఎంపీగా అతడి ఎన్నిక చెల్లదని కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. వచ్చే 6 సంవత్సరాల పాటు రేవణ్ణ ఏ విధమైన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది.

రేవణ్ణ తప్పుడు సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేశారంటూ... 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంజు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై హసన్ నియోజకవర్గ పౌరుడు దేవరాజగౌడ కూడ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు పైవిధంగా తీర్పునిచ్చింది. అయితే, రేవణ్ణ అనర్హతతో తనను ఎంపీగా ప్రకటించాలని బీజేపీ అభ్యర్థి మంజు కోరగా... ఆమె అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

Here's Live Law Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)