రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని యూపీ మాజీ సీఎం, బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి (Mayawati) ప్రకటించారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోబోమని, ఏ కూటమిలో చేరిది లేదని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల తర్వాత పొత్తు కుదుర్చుకునే ఆప్షన్‌ తమవద్ద ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) మరో పార్టీతో కలిసి పోటీచేసిన ప్రతిసారీ తాము నష్టపోయామన్నారు. తమతో పొత్తువల్ల భాగస్వామ్య పార్టీకే లాభం జరిగిందని తెలిపారు. తన 68వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గతంలో సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ పార్టీలతో పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే.

Here'PTI Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)