Chennai, Mar 28: తమిళనాడులోని (Tamilnadu) ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే నేత ఎ.గణేశమూర్తి (MP Ganeshamurthi Passes Away) గురువారం కోయంబత్తూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన ఆదివారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. తీవ్ర అనారోగ్యం పాలైన ఆయనను కుటుంబసభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో కోయంబత్తూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా గురువారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో కార్యకర్తలు, సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు.
Tamil Nadu MDMK MP Ganeshamurthi dies of cardiac arrest after suspected suicide attempt#Ganeshamurthi #TamilNadu #MDMK #ErodeMP #Erode #cardiacarresthttps://t.co/kA8qi9UMGW
— IndiaTV English (@indiatv) March 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)