Newdelhi, Nov 7: సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్ గా (Semi-Final) భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) భాగంగా తొలి సంగ్రామానికి తెరలేచింది. మిజోరంలో (Mizoram) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 40 నియోజకవర్గాలకు ఒకే విడుతగా నేడే పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక, ఛత్తీస్ గఢ్ లోని మొత్తం 90 స్థానాలకుగాను తొలి విడుతలో భాగంగా నేడు 20 సీట్లలో పోలింగ్ జరుగుతుంది. ఇక, మిజోరంలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో 174 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 8.57 లక్షల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం ఎన్నికల సంఘం 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. వీటిలో 30 పోలింగ్ కేంద్రాలు అంతఃరాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులో ఉండటంతో భారీగా బలగాలను మోహరించారు. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతాయి.
#WATCH | Chief Minister of Mizoram Zoramthanga casts his vote for the Mizoram Assembly Elections 2023 at 19-Aizawl Venglai-I YMA Hall polling station under Aizawl North-II assembly constituency. pic.twitter.com/w3MdGFLWme
— ANI (@ANI) November 7, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)