రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. దేశానికి 16వ రాష్ట్రపతి ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. ఉదయం 11 గంటల నుంచి పార్లమెంటు భవనంలో ఓట్ల లెక్కింపు ప్రారంభవుతుంది. మొదట ఎంపీల ఓట్లను లెక్కిస్తారు. అనంతరం రాష్ట్రాలవారీగా ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇంగ్లిష్ అక్షరక్రమంలో ఒక్కో రాష్ట్ర ఎమ్మెల్యేల ఓట్లను లెక్కిస్తారు. మొత్తం ఓట్ల కౌంటింగ్ అనంతరం తుది ఫలితాలను ప్రకటిస్తారు. సాయంత్రం 4 గంటల వరకు ఫలితాలు వెలువనున్నాయి. ఈ నెల 18న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. కాగా, ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ఈనెల 24తో ముగియనుంది. నూతన దేశాధినేత 25న ప్రమాణ స్వీకారం చేస్తారు.
President Election 2022 Result Live Updates: Counting of Votes To Begin at 11 Am@DroupadiMurmu__ @YashwantSinha #PresidentialElections2022 #PresidentialElections #DroupadiMurmu #YashwantSinha #NDAhttps://t.co/j9k5ev4Vgb
— LatestLY (@latestly) July 21, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)