ఉత్తరాఖండ్(Uttarakhand)లోని చార్‌ధామ్ యాత్రలో కొండచరియలు విరిగిపడటంతో 300 మంది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వాటి వల్ల రాష్ట్రంలోని పితోరాగఢ్ జిల్లాలోని లఖన్‌పుర్ సమీపంలోని లిపులేఖ-తవఘాట్ రహదారి 100 మీటర్ల మేర కొట్టుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రయాణికుల రాకపోకల కోసం రెండు రోజుల తర్వాత ఈ రోడ్డును తెరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఉత్తరకాశి, ఉదంసింగ్‌నగర్, గర్వాల్, చమోలీ, అల్మోరా సహా పలు జిల్లాల్లో దూళి, ఉరుములతో కూడిన వాన వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు కోరారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, వాహనాలను జాగ్రత్తగా పార్క్ చేసుకోవాలని సూచించారు.
ANI Tweet
Uttarakhand | On the outskirts of Pithoragarh, the Lipulekh-Tawaghat motor road, 45 km above Dharchula, near Lakhanpur, has been washed away 100 meters due to a landslide. About 300 people are trapped in Dharchula and Gunji: District Administration pic.twitter.com/2h04xWSdUL
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 1, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)