శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా డంబుల్లా సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొలొంబో స్ట్రయికర్స్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ ఆరో ఓవర్‌లో కుశాల్ పెరీరా కొట్టిన భారీ షాట్‌ను ఫిలిప్స్ కళ్లు చెదిరే విన్యాసం చేసి సిక్సర్ వెళ్లకుండా అడ్డుకున్నాడు. డీప్ మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఫిలిప్స్ పక్షిలా గాల్లోకి ఎగిరి గాల్లోనే బంతిని బౌండరీ రోప్ లోపలికి నెట్టాడు. ఫిలిప్స్ చేసిన ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోను చూసిన వారంతా ఫిలిప్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్ జరిగి ఐదు రోజులైనా నెట్టింట ఈ వీడియో ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంది. జేమ్స్ అండర్సన్ అవుట్-స్వింగింగ్ డెలివరీ వీడియో ఇదిగో, జాషువా డా సిల్వాను పెవిలియన్ సాగనంపిన ఇంగ్లండ్ స్పీడ్ స్టర్
Here's Video
Flying Glenn 🫡#ColomboStrikers #LPL #StrikeToConquer #TheBasnahiraBoys #HouseOfTigers #Lankapremierleague #GlennPhillips pic.twitter.com/0kDatTWH44
— Colombo Strikers (@ColomboStrikers) July 8, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)