సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఈ మధ్య జరిగిన వివాదాలపై ఏడుస్తూ తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ.. " చాలా ప్రయత్నం చేశా , కానీ నేను మనిషినే.. నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి .. నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది. కోపం, నిరాశ, ఆవేదన , దుఃఖం ..అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. కానీ, ఎన్నోసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు. పదే పడే ఇవే మాటలన్నారు. నా పార్టీ ( ప్రజల) కోసం , మహిళల కోసం , హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను. రూపాయి తీసుకున్నది లేదు ..ఎవరికి ద్రోహం చేసింది లేదు , మోసం చేసింది లేదు , కానీ కక్ష గట్టి మాటలంటూ ఉన్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు.
ఆడపిల్లగా ఎపుడు నేను సింపతీ గేమ్ ఆడలేదు. మహిళల చట్టాలను అనుకూలంగా ఉపయోగించలేదు. మగాడిలా పోరాడుతూనే ఉన్నాను .. ఈ కష్టాలను అధిగమిస్తాను. నా ధైర్యాన్ని కోల్పోను. నాకు కుటుంబం , స్నేహితులు ఉన్న సరే నా అభిమానులు , సోషల్ మీడియా లో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు ..నా బాధని మీతో పంచుకున్నందుకు…. క్షమించండి … మీ ప్రేమ అభిమానం , ఆశీర్వాదాలు నాకు శక్తిని ఇస్తాయి " అంటూ మాధవీలత తన పోస్టులో వెల్లడించారు.ఈ మధ్య తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పడంపై కూడా ఆమె స్పందించారు. తిట్టి క్షమాపణలు చెబితే సరిపోతుందా అంటూ మాధవీలత ప్రశ్నించారు.
Maadhavi Latha Gets Emotional on Recent Controversy
నా వల్ల కావట్లేదు బోరున ఏడ్చేసిన మాధవీలత | 10TV#Madhavilatha #Actress #reels #10TV pic.twitter.com/gqmPYUMzvS
— 10Tv News (@10TvTeluguNews) January 6, 2025
నీ స్టైలే వేరు J.C
తిట్టినా క్షమాపణ చెప్పినా నీ స్టైల్ ఎవరికి రాదు
సినీనటి బిజెపి నాయకురాలు మాధవీలత కు క్షమాపణ చెప్పుతూ మరొకసారి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ధర్మారం ఎమ్మెల్యే మంత్రి సత్య కుమార్ పై విరుచుకుపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి pic.twitter.com/1D347okIAt
— Kumar Reddy.Avula (@Kumar991957) January 5, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)