నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా సక్సెస్ కావడంతో మూవీ యూనిట్ ఆదివారం రాత్రి సక్సెస్ పార్టీ నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఈ పార్టీకి బాలకృష్ణతో పాటు ఆ సినిమా దర్శకుడు, నిర్మాత, హీరోయిన్లు, పలువురు హీరోలు హాజరై సందడి చేశారు.
డాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో బాలయ్యతో పాటు యంగ్ హీరోలు విశ్వక్సేన్, సిద్ధూ జొన్నలగడ్డ హంగామా చేశారు. సిద్ధూ, విశ్వక్సేన్ చెంపలపై బాలయ్య ముద్దులు పెట్టి.. అందర్నీ హుషారుపరిచారు. ఊర్వశి రౌతేలాతో బాలయ్య మళ్లీ స్టెప్పులేశారు. దబిడి దిబిడి పాటకు డ్యాన్స్ చేస్తూ ఊర్వశితో ఊగిపోయారు . బాలయ్య స్టెప్పులేస్తూ ఆమె దగ్గరకు రాగానే.. ఊర్వశి అటు నుంచి పక్కకు వెళ్లిపోయింది. అయితే ఈ వీడియోని ఊర్వశి తన ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.
వీడియో ఇదిగో, యంగ్ హీరోలకు ముద్దులు పెట్టిన బాలయ్య, ప్రతిగా వాళ్లు కూడా ముద్దులతో..
Urvashi Rautela shares a dance video with actor Nandamuri Balakrishna
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)