నూతన సంవత్సరం రోజున లోనావాలాలోని ఎక్వీరా దేవి ఆలయం వద్ద శాంతియుతంగా గుమిగూడిన భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో అనేక మంది భక్తులు గాయపడటంతో గందరగోళంగా మారింది. ఆలయంలో దర్శనం, పూజలు చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలువురు కుటుంబ సమేతంగా హాజరై పూజల్లో పాల్గొని నైవేద్యాలు సమర్పించారు. అయితే కొందరు భక్తులు రంగు రంగుల బాణాసంచా కాల్చడంతో ఆ పొగ తేనెటీగలు ఉన్న సమీపంలోని చెట్టుకు చేరింది. దీంతో ఒక్కసారిగా తేనెటీగల గుంపు ఆలయ ప్రాంగణం చుట్టూ చేరి భక్తులను కుట్టాయి. ఈ ఘటనలో పలువురు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం లోనావ్లాలోని ఆసుపత్రులకు తరలించారు. అదృష్టవశాత్తూ, వైద్య సంరక్షణ పొందిన తర్వాత వారి పరిస్థితి మెరుగుపడింది. తరువాత వారు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది.

వీడియో ఇదిగో, రోడ్డు మీద వెళుతూ మూడు పల్టీలు కొట్టిన స్కూల్ బస్సు , ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

bees attacked devotees at  Ekvira Devi Temple in Lonavla

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)