Reproductive choice: పిల్లల్ని కనడం, కనకపోవడం పూర్తిగా మహిళ ఇష్టం.. ఈ విషయంలో ఆమెపై భర్త ఒత్తిడి తగదు.. అబార్షన్ విషయంలో భర్త అనుమతి అవసరం లేదు.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
పిల్లల్ని కనడం, కనకపోవడం పూర్తిగా మహిళ ఇష్టమని.. ఈ విషయంలో ఆమెపై భర్త ఒత్తిడి తగదని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. సంతానం అంశం మహిళ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిందని తెలిపింది.
Mumbai, October 7: పిల్లల్ని కనడం, కనకపోవడం పూర్తిగా మహిళ ఇష్టమని.. ఈ విషయంలో ఆమెపై భర్త ఒత్తిడి (Pressure) తగదని బాంబే హైకోర్టు (Bombay High Court) అభిప్రాయపడింది. సంతానం అంశం మహిళ వ్యక్తిగత స్వేచ్ఛకు (Personal Freedom) సంబంధించిందని తెలిపింది. తన అనుమతి లేకుండా గర్భస్రావం చేసుకున్న భార్యతో తనకు విడాకులు ఇప్పించాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన ధర్మాసనం పై విధంగా స్పందించింది. అబార్షన్ విషయంలో భర్త అనుమతి అవసరం లేదన్నది. విడాకుల పిటిషన్ ను తోసిపుచ్చింది.
Husband Can't Force Wife To Give Birth, Reproductive Choice Insegregable To Woman's Personal Liberty: Bombay High Court @CourtUnquote https://t.co/6M3cTlLFYh
— Live Law (@LiveLawIndia) October 7, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 07, 2022 10:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

