Lucknow, Aug 13: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని లలిత్‌పూర్ జిల్లాలో (Lalitpur) మరో దళితుడు దాడికి గురయ్యాడు. ఉచితంగా చికెన్ (Chicken) ఇచ్చేందుకు నిరాకరించిన వ్యక్తిని రోడ్డుపైనే చెప్పులతో చావగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో (Video) సోషల్ మీడియాలో (Social Media) వైరల్ (Viral) అవుతోంది. మద్యం మత్తులో ఉన్న నిందితులు బాధితుడు సుజన్ అహిర్వార్‌ను నడిరోడ్డుపై చెప్పులతో కొడుతుండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బైక్‌పై తిరుగుతూ గ్రామాల్లో చికెన్ విక్రయించే అహిర్వార్ వద్ద నిందితులు చికెన్ తీసుకున్నారు. డబ్బులు అడగడంతో రెచ్చిపోయారు. అతడిని పట్టుకుని ఈడ్చుకుంటూ చెప్పులతో దాడిచేశారు. వదిలేయాలని ప్రాధేయ పడుతున్నా కనకరం లేకుండా విచక్షణ రహితంగా దాడిచేశారు. వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
It is said that the victim, Sujan Ahirwar, was beaten by men who were allegedly in a drunken state and refused to pay him for the chicken. #UttarPradesh https://t.co/dCc7RVXTQJ
— IndiaToday (@IndiaToday) August 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)