ఢిల్లీలోని వివేక్‌ విహార్‌ ప్రాంతంలో నడిరోడ్డుపైనే ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరింపులకు దిగి దోపిడీకి పాల్పడ్డారు. యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని అప్పటికే బైక్‌పై వచ్చి మాటువేసి ఉన్న ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. ఆ తర్వాత జేబులో నుంచి గన్‌ను తీసి బెదిరించారు. వారి నుంచి బంగారు బ్రాస్‌లెట్‌, తదితర విలువైన వస్తువులు ఇవ్వాలని బెదిరించారు. ఆ తర్వాత వాటిని తీసుకొని పరారయ్యారు. ఈ దోపిడీ దృశాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)