Gandhinagar, Dec 23: ఐసీయూ (ICU)లో చికిత్స పొందుతున్న ఓ రోగి బీడీ (Beedi) వెలిగించాడు. దాంతో మంట‌లు (Fire) చెల‌రేగాయి. అప్ర‌మ‌త్త‌మైన ఆస్ప‌త్రి సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసింది. రోగిని మ‌రో వార్డుకు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌ లోని జామ్‌న‌గ‌ర్‌ లో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. గుజ‌రాత్‌ లోని జీజీ ఆస్ప‌త్రిలో ఓ రోగికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే అత‌ను బీడీ వెలిగించాడు. ఆ బీడీ మంట‌లు మాస్కుకు అంటుకున్నాయి. అనంత‌రం అక్క‌డున్న బెడ్‌ కు కూడా వ్యాపించాయి. అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది అక్క‌డికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. కాలిన గాయాల‌తో బాధ‌ప‌డుతున్న ఆ రోగిని మ‌రో వార్డుకు త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు.

BRS PPT Today: కేటీఆర్‌ కీలక ప్రకటన.. తెలంగాణ భ‌వ‌న్‌ లో ‘స్వేద పత్రం’ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)