Hyderabad, Feb 3: వచ్చే నెలలోగా హైదరాబాద్ (Hyderabad), విజయవాడతో (Vijayawada) పాటు కోల్ కతా (Kolkata), పుణె (Pune) విమానాశ్రయాల్లో డిజీ యాత్ర (DigiYatra) సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర వైమానిక శాఖ తెలిపింది. ప్రయాణికుల రద్దీ నెలకొన్న నేపథ్యంలో ఇటీవల పలు విమానాశ్రయాల్లో చెక్ ఇన్  కోసం వందలాది మంది గంటలకొద్దీ వేచి చూడాల్సి వచ్చింది. దీంతో కేంద్రం ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి డిజీ యాత్ర సేవలను తీసుకొచ్చింది. ప్రయాణికుల స్మార్ట్ ఫోన్ లోనే వారి వివరాలు, ప్రయాణ డీటేయిల్స్ తదితరాలను పర్సనల్లీ ఐడెంటిఫేబుల్ ఇన్ఫర్మేషన్ (పీఐఐ) గా నమోదు చేస్తారు. దీనికోసం డిజీ యాత్ర పేరిట ఓ ఐడీ పంపుతారు. 24 గంటలపాటు అందుబాటులో ఉండే ఈ డీజీ సమాచారంతో ఎలాంటి ఆలస్యం లేకుండా ఎయిర్ పోర్టుల్లో చెక్-ఇన్ పూర్తి చేసుకోవచ్చు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)