Hyderabad, Dec 8: మహిళలకు (Women) టీఎస్ ఆర్టీసీ (TSRTC) బస్సుల్లో ఉచిత ప్రయాణం (Free Bus Travel) కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. శనివారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నది. బస్సుల్లో ఆధార్ కార్డును చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. శుక్రవారం సంబంధిత శాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించే సమావేశానంతరం తుది మార్గదర్శకాలు ఖరారు కానున్నాయి. ఈ పథకం అమలుపై మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న తమిళనాడు, కర్ణాటకలో టీఎస్‌ఆర్టీసీ ఐదుగురు అధికారుల బృందం పర్యటించింది. ఫ్రీ బస్సు ప్రయాణానికి సంబంధించి మరికొద్దిసేపట్లో పూర్తి నిబంధనలు తెలియబోతున్నాయి.
Free bus travel for Women from December 9
డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఉచ్చిత బస్సు ప్రయాణం
మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు రవాణా సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షల వరకు పెంపు నిర్ణయాలను సోనియాగాంధీ పుట్టిన రోజు నుంచి అమల్లోకి తీసుకువస్తాం.
-- తెలంగాణ మంత్రి, శ్రీధర్ బాబు… pic.twitter.com/yJfYzboMCr
— Congress for Telangana (@Congress4TS) December 7, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)